అన్ని కౌన్సిలర్లు గెలవాలి అభివృద్ధికి ఆదర్శం కావాలి !

👉 ఎన్నికల ప్రచారంలో మంత్రి సుడిగాలి పర్యటన !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల లో ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 15 స్థానాలకు 15 గెలిచి అభివృద్ధికి ధర్మపురి పట్టణం ఆదర్శంగా కావాలి అని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.మంత్రి లక్ష్మణ్ కుమార్ గురువారం ధర్మపురి పట్టణంలోని 4, 5, 6,7, 12, 15  వార్డులలో విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు .


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆయా వార్డులలో మాట్లాడుతూ….

అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..గుడి పూజాలను.. పల్లకి మోసిన బోయలను పట్టించుకోలేదు..ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటల నమ్మద్దు..మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు అనిమంత్రి అన్నారు.

👉 బీఆర్ఎస్  10 ఏళ్లలో పరిపాలనలో ఏనాడు పేద ప్రజల సంక్షేమ పట్టించుకోలేదని,  అర్హులైన పేదలకు   ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలయంలో పూజారుల సమస్యతో పాటు బోయలు, స్వీపర్ల సమస్యను పరిష్కారించానని వారి జీతాలు పెంపుదల చేశానన్నారు.

👉 రాష్ర్టంలో ప్రజా పాలన ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 బిగతంలో  శ్రీలక్ష్మి నర్సింహాస్వామి ఆలయం దేవాలయంలో నిర్వహిస్తే కొంత మందికి మాత్రమే కల్యాణం వీక్షించే అవకాశం ఉండేదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గోదావరి నది ఒడ్డున శ్రీలక్ష్మి నర్సింహాస్వామి కల్యాణం నిర్వహించి లక్షల మంది ప్రజలు వీక్షించే విధంగా చేశామని  మంత్రి గుర్తు చేశారు.

👉 ధర్మపురి లక్ష్మినర్సింహాస్వామి ఆలయాన్ని స్వర్గీయ  మాజీ మంత్రి  జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ది మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ధర్మపురి పట్టణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వచ్చే మున్సిపాలిటి ఎన్నికల్లో 15 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.

👉 ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మద్దు.. మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు అని తప్పును పది సార్లు ఒప్పు అనే విధంగా ప్రజలను వాళ్ల నమ్మిస్తారని మంత్రి  లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ వరాల హామీ..

  బోయ కులస్తులకు కమ్యూనిటి ( హాల్ ) భవన నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. గంగా పుత్రులకు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని 4, 12  రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిస్తే 60 రోజుల్లో అధికారులను వెంట బెట్టుకొని వచ్చి డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి పేర్కొన్నారు.  వార్డుల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

👉 మీ వార్డులలో  సామూహిక సమస్యల పరిష్కారానికి, వ్యక్తిగత సమస్యలు సహాయ సహకారాలు అందించడానికి నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని మంత్రి ఓటర్లకు హామీ ఇచ్చారు..

👉 విద్యా, వైద్యం, తాత్కాలిక వేతనలపై ఉద్యోగాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం,  కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి ఎల్ఓసి, తదితర వార్డు సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి  ఒకటే మార్గం మీ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి.. మీ వాడ కౌన్సిలర్ తో నేరుగా వచ్చి మీ సమస్యలు  వార్డు అభివృద్ధి అంశాలు పరిష్కరించుకోవాల్సిందిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు హామీ ఇచ్చారు