👉 జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ర్టానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్ మరియు వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామన్నారు.
👉 ipr.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈనెల 9వ తేదీ నుండి దరఖాస్తు లను ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రిడిటేషన్ దరఖాస్తు మరియు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని,
👉 సాంకేతిక సమస్య ఏర్పడితే…..

దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైన టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగంలో ఈ నెంబర్ 9154170881కు కార్యాలయం పని వేళలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలలో సంప్రదించవచ్చునని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.
👉 జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్నిఅమలు చెయ్యండి!
👉 రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ !
రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేయనున్న ఆరోగ్య పథకంలో జర్నలిస్టులను చేర్చి వారికి కూడా ఆ పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం బంజారాహిల్స్ లోని మినిష్టర్ క్వార్టర్స్ లో ఆయన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను కలిసి జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టిందని, అదే మాదిరిగా ప్రస్తుతం అమలు చేయాలని విరాహత్ అలీ మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
