👉 అడ్డుకునేది ఎవరు ? అడిగేవారు ఎవరు ?
👉 పచ్చ నోట్ల మాయాజాలంలో పచ్చని అడవుల ధ్వంసం !
J.SURENDER KUMAR,
ధర్మపురి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీర్పూర్ మండల అడవి గ్రామాల్లో అటవీ భూముల నుంచి అక్రమంగా మట్టి దోచుకున్న వారికి దోచుకున్నంతగా మట్టిని తరలిస్తున్నారు..
రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జెసిబి యంత్రాలతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. అడవులను, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు మట్టి నింపుకోవడానికి ( బరంతి ) కొంతమందికి మాత్రమే అనుమతించినట్టు సమాచారం. మట్టి అక్రమ రవాణా దారులు ఈ మట్టిని ఒక్కో ట్రాక్టర్ కు ₹ 1200/- చొప్పున అమ్ముకుంటున్నారు.

👉 పరస్పర దాడులకు రంగం సిద్ధం ?
రెండు గ్రామాల మధ్య శివారు అటవీ భూముల నుంచి మట్టి తరలింపును గురువారం మరో గ్రామస్తులు అడ్డుకున్నారు. పరస్పరం వాదోపవాదాలు, దాడులు జరిగాయి. మట్టిని అక్రమంగా తరలించినా , తరలింపును వారు అడ్డుకున్న దాడులకు సమాయత్తమైనట్టు అడవి గ్రామాల్లో చర్చ జరుగుతున్నది.
తుంగూరు గ్రామం వడ్డెర కాలనీ నుండి చర్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో గల అటవీ భూమి నుంచి మట్టి తరలిస్తున్నారు. (వరి వాగు బ్రిడ్జి నుంచి చర్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ) మట్టి అక్రమ రవాణా నిత్యం ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ అమ్ముకుంటున్నారు.
👉 పట్టించుకోని అటవీశాఖ యంత్రాంగం !

బీర్పూర్ మండలంలో తుంగూర్, మంగేలా, లో సెక్షన్ అధికారులు, ఐదుగురు బీట్ అధికారులు, ఐదు బేస్ క్యాంపులు ఉన్న అడవి నుండి నిత్యం వందలాది ట్రాక్టర్ల మట్టి అక్రమంగా తరలిపోతున్న అటవీశాఖ యంత్రాంగం పట్టించుకోక చోద్యం చూస్తున్నారు అనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. కొందరు యువకులు మట్టి తరలింపు వీడియోలు, ఫోటోలను అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్, కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం మట్టి అక్రమ రవాణాను కట్టడి చేయకుంటే అటవీ గ్రామాలలో పరస్పర దాడులు ప్రతి దాడులు జరిగే అవకాశం ఉంది.
