అటవీ గ్రామంలో.. నక్సల్స్ రాజ్యమా ?

👉మృతుడి పాడే మోయవద్దని సర్పంచ్ హుకుం !


J.SURENDER KUMAR,

ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అటవీ గ్రామానికి నూతన సర్పంచిగా ఎన్నికయ్యారు నక్సల్ రాజ్యంలో ప్రజా కోర్టు తరహాలో గ్రామస్తులకు సర్పంచ్ హుకుం జారీ చేశాడు..

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి  గ్రామస్థులు సాహసం చేయలేదు..
బీర్పూర్ మం. కందనకుంట గ్రామపంచాయతీ పరిధిలోని తుంగూరు గూడెం ( తుంగూర్ గ్రామం నుంచి కండ్ల పెళ్లి గ్రామానికి వెళ్లే దారిలో కుడి వైపు)   అటవీ గ్రామంలో బుధవారం జరిగిన అమానవీయ ఘటన. మృతుడు ఏదుల రాజేశం ఇంటి దరిదాపు లోనే సర్పంచ్ నివాసం ఉంటున్నాడు.

గ్రామస్తులను, మృతుడి దూరపు చుట్టాలను పాడె మోయకూడదని  సర్పంచ్.. హుకుం జారీ చేశాడు. కాళ్లు మొక్కుతామని వేడుకున్నా  సర్పంచ్, కనికరించలేదు..

సర్పంచ్ హుకుం కు భయపడిన పెద్ద మనుషులు  గత కొంతకాలం క్రితం ఎదుల రాజేశం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన పెద్దలుఅతని మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, కన్నీరు మున్నీరుగా రోదిస్తూ పాడె మోసిన భార్య, అక్కలు, సొంత కుటుంబ సభ్యులు మృతుడి అంత్యక్రియలు జరిపారు.

గత కొన్ని నెలల క్రితం ఇదే గ్రామపంచాయతీ లో  అభం శుభం తెలియని ఓ గిరిజన బాలిక అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటనలో కుటుంబ సభ్యులనే యంత్రాంగం వేధించిందని ఆరోపణలు ఉన్నాయి.