ఆత్మవిశ్వాసమే విజయానికి నాంది మంత్రి అడ్లూరి!

👉 ఇంటర్ విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

J.SURENDER KUMAR,

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలు అనగానే సాధారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని మంత్రి అన్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి కోరారు.

ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, ఎస్సీడీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి తమ కుటుంబాలకు, గురుకులాలకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. మీ విజయం మీ కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ గర్వకారణం అవుతుంది. ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.



👉 TGSWREIS పరిధిలో : 

మొదటి సంవత్సరం విద్యార్థులు : 14,267
రెండవ సంవత్సరం విద్యార్థులు : 13,928
మొత్తం: 28,195

👉 TGTWREI పరిధిలో :

మొదటి సంవత్సరం విద్యార్థులు : 7,468
రెండవ సంవత్సరం విద్యార్థులు : 7,155
మొత్తం 14,623

👉 SCDD ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల విద్యార్థులు
మొదటి సంవత్సరం 4,643

👉 రెండవ సంవత్సరం విద్యార్థులు 3,399
మొత్తం  8,042  పరీక్షలకు హాజరవుతున్నారు.


గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 100 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షల కు హాజరు అవుతున్నారని  మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.