👉 అటవీశాఖ అండ దండలా ?
👉 గ్రామాల లో శాంతి భద్రతల సమస్యలు !
👉 ధర్మపురి అటవీశాఖ రేంజ్ పరిధిలో..
J.SURENDER KUMAR,
ధర్మపురి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీర్పూర్ మండల అడవి గ్రామాల్లో అటవీ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అర్ధరాత్రి యంత్రాలతో ట్రాక్టర్లు ద్వారా మట్టిని తరలిస్తున్నారు.. గురువారం అర్ధరాత్రి రెండు గ్రామాల మధ్య శివారు అటవీ భూముల నుంచి మట్టి తరలింపును మరో గ్రామస్తులు అడ్డుకున్నారు. పరస్పరం వాదోపవాదాలు, దాడులు ,ప్రతి దాడులకు సిద్ధం కాగా కొందరు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు.

.
👉 వివరాలు ఇలా ఉన్నాయి…
తుంగూరు గ్రామం వడ్డెర కాలనీ నుండి చర్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో గల అటవీ భూమి నుంచి మట్టి తరలిస్తున్నారు. (వరి వాగు బ్రిడ్జి నుంచి చర్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ) మట్టి అక్రమ రవాణా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ అమ్ముకుంటున్నారు.
గురువారం రాత్రి వడ్డెర గూడెం వాసులు, చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్లను, జెసిబి యంత్రాలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి, అంతు చూస్తామంటూ పరస్పరం హెచ్చరించుకున్నారు. మాకు అటవీ శాఖ అధికారి అనుమతించారు అంటూ చర్లపల్లి గ్రామ ప్రతినిధి ఈ సందర్భంగా వారితో అన్నట్టు తెలిసింది..

👉 ఇద్దరు సెక్షన్ అధికారులు !
బీర్పూర్ మండలంలో తుంగూర్, మంగేలా, లో సెక్షన్ అధికారులు, ఐదుగురు బీట్ అధికారులు, ఐదు బేస్ క్యాంపులు ఉన్నాయి. వీరు అడవులను, అటవీ భూములను కాపాడుతూ పర్యవేక్షిస్తుంటారు. అయితే వీరు స్థానికంగా ప్రకృతి ప్రేమికులకు అందుబాటులో ఉంటారో ? లేదో ? స్పష్టమైన సమాచారం తెలియదు.
యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం రంగ ప్రవేశం చేసి అక్రమ మట్టి తరలింపు అడ్డుకోకుంటే అడవి గ్రామాలలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది.
