అవినీతి పరులకు మున్సిపల్  అప్పగిస్తే అదోగతి !

👉 ధర్మపురి మున్సిపల్ లో అధికారం అప్పగించండి అభివృద్ది చేయించుకోండి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపాలిటిని పోరపాటున అవినీతి పరులకు అప్పగిస్తే అదోగతి పాలు అవుతుందని, ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చిన ధర్మపురి ప్రజలు మున్సిపాలిటి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

👉 పట్టణంలోని పటేల్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, నంది చౌరస్తా, అంబేద్కర్ జంక్షన్, మీదుగా ఎస్ఎచ్ ఫంక్షన్ హాల్ వరకు మంత్రి  లక్ష్మణ్ కుమార్ భారీ ర్యాలీ  నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి పటేల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురి ఎమ్మెల్యే, ధర్మపురి మున్సిపాల్ చైర్మన్, ధర్మపురి శ్రీలక్ష్మి నర్సింహాస్వామి ఆలయంలో కమిటి చైర్మన్ వారే ఉన్నప్పటికీ ధర్మపురి పట్టణాభివృద్దిని ఎవ్వరు పట్టించుకోలేదని విమర్శించారు.

👉 బీఆర్ఎస్ పాలనలో ధర్మపురి మున్సిపాలిటిని అవినీతి మయం చేశారని మంత్రి  అన్నారు.  ప్రజలకు కనీస అవసరాలు విషయం పట్టించుకోక పోవడంతో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు.

👉 తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేస్తున్నామని మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో ధర్మపురి పట్టణాన్ని మరియు ఆలయాన్ని అభివృద్ది చేయాలంటే మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మోజార్టీలో 15మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

👉 రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు !

చివరి రోజు ప్రచారంలో పట్టణంలో  కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. పట్టణంలోని 15వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీకి తరలివచ్చారు. మూడు రంగుల జెండాతో మంత్రి  ముందుకు సాగగా మంత్రిని అనుసరిస్తు మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రి వెంట ర్యాలీగా తరలి వెళ్లారు.

👉 సహపంక్తి భోజనం చేసిన మంత్రి !

ఎన్నికల ప్రచారంలో చివరి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు, పార్టీ కార్యకర్తలకు ఎస్ఎచ్ గార్డెన్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా మంత్రి లక్ష్మన్ కుమార్ మహిళలు , కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  అక్క చెల్లెల్లు, అన్నదమ్ములతో కలిసి తినడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.