👉 ధర్మపురి ఆలయంలో నిత్య అన్నదానాన్ని సత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి !
J.SURENDER KUMAR,
ఆలయాలకు వచ్చే భక్తులు వాడు సాక్షాత్తు భగవంతుడి స్వరూపాలని వారి పట్ల భక్తి భావంతో సేవలు అందిస్తూ ప్రేమ తత్వం, వినయ విధేయతలతో ప్రవర్తించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..
మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దశావతారం మంత్రి ఆకస్మికంగా ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి ఉచిత నిత్యాన్నదాన ప్రాంగణాన్ని, వంటగదిని, భక్తుల కోసం వండిన వంట పదార్థాలను పరిశీలించారు.

దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యత ప్రమాణాలతో రుచికరమైన భోజనం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాలయ అధికారులను ఆదేశించారు.
ఈసందర్భంగా మంత్రి వంట గదిని పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు, వండిన అన్నం, వంట పదార్థాలను పరిశీలించారు. భోజనం చేస్తున్న భక్తులను రుచి, నాణ్యత ప్రమాణాలు, ఎలా ఉన్నాయి ? భోజనంలో అదనంగా వంటకాలు చేర్చాల్సిన అవసరం ఉందా ? తాగు నీరు, సిబ్బంది ప్రవర్తన తీరు తదితర అంశాలను మంత్రి ప్రత్యక్షంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు.

మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ? దర్శనం ఎలా జరిగింది ? త్వరితగతిన స్వామివారి దర్శనం కోసం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా ? అని మంత్రి భక్తుల నుంచి సలహాలు సూచనలను అడిగారు.

నిత్య అన్నదాన సత్రంలో భక్తుల సౌలభ్యం కోసం మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా నిధులు కేటాయిస్తానని మంత్రి తెలిపారు. ఇందుకు కావలసిన అంచనాలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
