భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

డాటా సెంట‌ర్ల‌కు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీల‌ పై సమగ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సూచించారు.


👉 రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు, వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్షించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సాగుతున్న భూ సేక‌ర‌ణ‌పై అధికారుల‌ను ఆరా తీశారు.


👉 భూ ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. రైతుల‌ను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా ప‌రిహారం నిర్ణ‌యించాల‌న్నారు. రూ. వేల కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్టే సంస్థ‌లు భూమిపై పెట్టె పెట్టుబ‌డి చాలా స్వ‌ల్ప‌మ‌న్నారు. కంపెనీల‌కు స‌కాలంలో భూమి, ఇత‌ర వ‌స‌తులు అందుబాటులో ఉంచితే త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేసుకుంటార‌ని ముఖ్యమంత్రి  అన్నారు.


👉 ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు , ముఖ్య‌మంత్రి స్పెష‌ల్ సెక్ర‌ట‌రి అజిత్ రెడ్డి , ఐటీ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్‌ , విద్యుత్ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్‌ , ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ క‌మిష‌న‌ర్ శ‌శాంక తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.