👉 కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎన్నికల లో
2,54, 30,31,32, 33 డివిజన్ ప్రచారంలో….
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
J SURENDER KUMAR,
రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటై కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగాని అనిల్ కు మద్దతుగా శనివారం మంత్రి ప్రచారం నిర్వహించారు
అనంతరం 54, 30,31,32, 33 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున నాకా చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ లో గెలిచిన కార్పొరేటర్లు కు ఇందిరమ్మ ఇళ్లు అర్హులను గుర్తించి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని మంత్రి ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.
