చైర్ పర్సన్ రాక కోసం మంత్రి అడ్లూరి ప్రోటోకాల్ వెయిటింగ్!

👉 ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో  సంఘటన !


J SURENDER KUMAR,

ఆయన నాలుగు సంక్షేమ శాఖల క్యాబినెట్ మంత్రి  (తెలంగాణ ప్రభుత్వం) ధర్మపురి పట్టణ ప్రథమ పౌరురాలు వేదికపై కి రాక కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్  ప్రోటోకాల్  పాటిస్తూ కొన్ని నిమిషాలు పాటు వేదిక పై నిల్చున్నారు.  మంత్రితోపాటు అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, కమిషనర్ శ్రీనివాసరావు, తాసిల్దార్ శ్రీనివాస్ సైతం నిల్చున్నారు. చైర్ పర్సన్ నాగలక్ష్మి వేదిక పైకి వచ్చి తన స్థానంలో కూర్చుండగానే మంత్రి, అధికారులు కూర్చున్నారు. 

👉 బుధవారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంత్రి  ప్రోటోకాల్ వెయిటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..



👉 1 చైర్ పర్సన్ రాక కోసం వెయిట్ చేస్తున్నా మంత్రి అడిషనల్ కలెక్టర్ !


ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కోస్గిలో 16 కౌన్సిలర్ స్థానాలకు 16, మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి లో 15 కౌన్సిలర్ స్థానాలకు 15 క్లిన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించిన విషయం విధితమే.


👉 2 చైర్ పర్సన్ ఆహ్వానిస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !


ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గ చైర్ పర్సన్, వేముల నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


👉 3 మంత్రి తాను వెనక్కి జరిగి ఆమె కు కుర్చీ చూపిస్తున్న దృశ్యం ,!


చైర్ పర్సన్ నాగలక్ష్మి మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతల స్వీకరణకు మంత్రి హాజరయ్యారు. కార్యాలయ ఆవరణలో ప్రత్యేక వేదిక ఏర్పాటు ఏర్పాటు చేశారు.


👉 4 చైర్ పర్సన్ తో పాటు నిల్చున్న మంత్రి అధికారులు !


వేదిక పైకి మంత్రి, అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్ చేరుకొని తమ తమ కుర్చీల  వద్దకు చేరుకున్నారు. చైర్ పర్సన్ కు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు, చెప్పడానికి రావడంతో ఆమె తన చాంబర్ నుంచి బయటికి రావడానికి ఆలస్యమైంది. చైర్ పర్సన్ కు కౌన్సిలర్లు ,మున్సిపల్ సిబ్బంది, సమాచార ఇవ్వడంతో ఆమె పరుగున వేదిక వద్దకు చేరుకుంది.


👉 5 చైర్ పర్సన్ తో పాటు మంత్రి తమ స్థానంలో  కూర్చుంటున్న దృశ్యం !

మంత్రి లక్ష్మణ్ కుమార్  చైర్ పర్సన్ ఆమె కుర్చీ వద్దకు ఆహ్వానించి ఆమెతో పాటు, మంత్రి వేదిక పై ఆశీనులయ్యారు. కార్యక్రమం నిర్వాహకుడు వేదిక పైకి కౌన్సిలర్లను,  ఆలయ చైర్మన్ సభ్యులను ఆహ్వానం పలికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఆహ్వానించడం మర్చిపోయాడు. మంత్రి లక్ష్మణ్ కుమార్, జోక్యం చేసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లను వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా. ఆదేశించారు.



రాష్ట్ర క్యాబినెట్ మంత్రి లక్ష్మణ్ కుమార్, పాటించిన ప్రోటోకాల్ వెయిటింగ్ అంశం పై పలువురు ప్రశంసిస్తున్నారు.