సీఎం, మంత్రి అడ్లూరి నియోజకవర్గాలలో రికార్డు !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ ( వికారాబాద్ జిల్లా) లో 16 వార్డులు, మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిథ్యంలో వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసి మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు.

👉 మంత్రి అడ్డూరి అన్ని తానై…

మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రతిపక్షంలో ఉండగా 2020 లో ధర్మపురి మున్సిపాలిటీకి మొదటిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులలో నాటి అధికార బిఆర్ఎస్ కు పోటీగా  పోరాడిప 7 కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకున్నారు.

కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక లో మంత్రి స్వతంత్ర సర్వే చేయించుకున్నారు. కాంగ్రెస్ జెండా మోసిన వారిని కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న వారిని ఎంపిక చేసుకుని. బి ఫామ్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులతో ఇంటింటికి  తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

👉 నా ప్రవర్తన చూడండి..

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,  మంత్రిగా నా రెండు సంవత్సరాల కాలంలో నా ప్రవర్తన చూడండి.. నేను క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న.. అధికార దర్పంతో అరాచకాలు చేయలేదు.

  మీరు నేరుగా నా వద్దకు  వస్తున్నారు , మధ్యవర్తుల ప్రమేయం లేదు, మీ వార్డులో కౌన్సిలర్ ను  గెలిపించండి వార్డ్ అభివృద్ధి పనులకు అతడే పిల్లర్ అవుతాడు. ఇది మంత్రి ఎన్నికల ప్రచార సరళి. మార్నింగ్ వాక్ పేరిట వార్డుల వారీగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం కార్నర్ మీటింగులు, వివిధ కుల సంఘాల పెద్దలతో చర్చలు. ప్రతి వార్డులో తానే మీ అభ్యర్థి అనుకోని గెలిపించండి అంటూ పదే పదే ఓటర్లను అభ్యర్థించడంతో ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అనేది చర్చ జరుగుతోంది.