👉 హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగానికి ఆహ్వానం !
👉 భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్నఏకైక నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో ‘లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీఫస్ట్ సెంచరీ’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో అరుదైన ఆహ్వానం లభించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాల్సిందిగా ముఖ్యమంత్రి ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

👉 ఈ సింపోజియంలో వక్తగా పాల్గొనడానికి ఆహ్వానం పొందిన వారిలో భారతదేశం నుంచి ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే కావడం విశేషం. వచ్చే మార్చిలో జరగనున్న ఈ కార్యక్రమంలో హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ జెరెమీ వైన్‌స్టీన్‌తో కలిసి కీలక ప్రసంగం చేయాలని ముఖ్యమంత్రి కి ప్రత్యేక ఆహ్వానం అందింది.

👉లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీఫస్ట్ సెంచరీ’ గ్రూప్ డిస్కషన్ లో ముఖ్యమంత్రి )
👉 వివిధ రంగాల ప్రముఖులు, సాంకేతిక నిపుణులు సింపోజియంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి ఆహ్వానితులకు తెలిపారు.
👉 హార్వర్డ్ యూనివర్సిటీలో కార్యక్రమాల చివరి రోజున ముఖ్యమంత్రి వివిధ ప్రతినిధి బృందాలు, ఎంఐటీ, కొలంబియా యూనివర్సిటీల విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు. నాయకత్వం, ఆర్థిక వృద్ధి, సుస్థిరాభివృద్ధి, పర్యావరణం, రైతులు, మహిళలు, యువత సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు.

👉యూనివర్సిటీలో సహచర మిత్రులతో సీఎం
👉 తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధికారతాభివృద్ధి దిశగా ఉన్న అవకాశాలను వివరించారు. భవిష్యత్ భారత పురోభివృద్ధిలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ముందుండి దిశానిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ దేశాల్లో చదువుతున్న విద్యార్థులు తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.
