J.SURENDER KUMAR,
తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.
👉 తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తో పాటు కమిషన్ సభ్యులు తెలంగాణ విద్యా విధానంపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి కి సమర్పించారు.

👉 అమెరికా, వియత్నాం, మలేసియా వంటి దేశాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి నివేదికలోని అంశాలను సుదీర్ఘంగా వివరించారు. నివేదికలోని అంశాలను తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
👉 ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , డాక్టర్ కె కేశవరావు , సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి , సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి , ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి , విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
