J.SURENDER KUMAR,
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సహచరులు అభినందనలు తెలిపారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జూపల్లి కృష్ణా రావు , తుమ్మల నాగేశ్వర రావు , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క , వివేక్ వెంకటస్వామి , వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజారుద్దీన్ , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.
👉 మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సీఎం సంతాపం !

మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ నుంచి శాసనసభ్యుడి వరకు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అనేక సేవలు అందించారని కొనియాడారు. రాంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చార్మినార్ మాజీ శాసనసభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ పాషా ఖాద్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఖాద్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
