J.SURENDER KUMAR,
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడోబ్ సీ ఈ ఓ, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ తో చర్చించారు.
👉 హైదరాబాద్ లో బుధవారం శంతను నారాయణ్ ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి తో చర్చించారు.
👉 మాన్యుఫాక్చరింగ్ రంగంలో తెలంగాణను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు, ప్రముఖ సంస్థలను ఆకర్షించడానికి సరైన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
👉 ఏఐలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై శంతను నారాయణ్ తో ముఖ్యమంత్రి చర్చించారు. సాంకేతిక రంగంతో పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.
