👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
👉 రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
👉 ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.
👉 అదేవిధంగా, రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద–మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు.
👉 ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్న ముఖ్యమంత్రి , రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
👉 సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రియాంక గాంధీ !

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రియాంక గాంధీ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై శ్రీమతి ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.
