👉 రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడమే నా తప్పా.?
👉 కష్టకాలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండటం నా బాధ్యత… కాదా ?.
👉 బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే తో చర్చించి కాంగ్రెస్ జాబితా రూపొందించడం ఏమిటి ?
👉 మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడమే నేను చేసిన పాపమా ? రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడమే నా తప్పా? కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండటం నా బాధ్యత కాదా ?. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే తో చర్చించి జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా రూపొందించడం ఏమిటి ? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాటలలో….
ఇటీవల జగిత్యాలకు వచ్చిన మిత్రుడు ( ఎమ్మెల్సీ వెంకట్రావు ) ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారు..
👉 నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ తో అనుబంధం ఉంది.నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన..కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
👉 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీత లో కూడా జగిత్యాల రాయికల్ మున్సిపల్ లో కార్యకర్తలు పట్టుదలతో పోటీ చెసి, కాంగ్రెస్ పార్టీ కి అండగా నిల్చున్నారు.
👉 టీ ఆర్ ఎస్ పాలనలో దశాబ్ద కాలం పోరాటం చేసినం ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీ లో 50 వార్డుల్లో కనీసం 40 గెలుపొందుతాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు..టిక్కెట్లు ఆశించడం తప్పా ?
👉 కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేసి, కాంగ్రెస్ జెండా మోసిన వారి పేర్లను ప్రతిపాదించిన !
👉 అభ్యర్థులు ఎవరైనా.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని కోరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జాబితా అందజేసిన !
👉 కాంగ్రెయు పార్టీ నిబద్ధత గా రాజకీయ పార్టీ.. రాహుల్ గాంధీ ఆలోచన కు అనుగుణంగా.. రాజ్యంగా నిబంధనలు కు అనుగుణంగా కొనసాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..

👉 జగిత్యాల ఎమ్మెల్యే.. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే.. పార్టీ ఫిరాయింపు చట్టం కింద నోటీసు ఇవ్వగా.. స్పీకర్ కు తాను బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అని అఫిడవిట్ ఇచ్చారు అని గుర్తు చేశారు.
👉 ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్ కు రావడం పై నిలదీసిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని మున్సిపల్ ఎన్నికల టికెట్ల పై చర్చించడం ఏమిటి..క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘిస్తున్నారు.?
👉 దేశం అంతా రాజ్యంగ పరిరక్షణ పాటుపడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు..
👉 ఐదేళ్లు శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే తో చర్చించి జాబితా రూపొందించడం ఏమిటి ?
👉 కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారి గతి ఏమి కావాలి పదేళ్లు కష్టపడిన కార్యకర్తల తినే కాడి పళ్ళెం లాకెళ్ళితే ఎంత ఆవేదన ఉంటది !
👉 ఫైనల్ జాబితా చేర్పులు మార్పులు ఏమిటి పార్టీ లో ఏం జరుగుతోంది మున్సిపల్ అధికారులు ప్రకటిస్తే గానీ ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి అనేది తెలిసేలా లేదు !
👉 క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడటమే నేను చేసిన తప్పా ?
👉 ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు.
ఎన్నికల్లో జెండా మోసిన వారికి అవకాశం ఇస్తామనీ మీరే చెప్పారు !
👉 దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల కు వలసవాదులకు.. అవకాశ వాదులకు జరుగుతున్న పోటీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులు కాపాడాల్సిన బాధ్యత నా పై ఉంది !
👉 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి.. గతంలో లిఖిత పూర్వకముగా లేఖ కూడా రాసినా.
👉 పార్టీ కోసం పనిచేసినా వారీ అవకాశాలను కాజేస్తే సహించేది ఎలా..జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వారికి బీ ఫారం ఇచ్చారు.
👉 కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఏం కావాలి రాయికల్లో ఏకాభిప్రాయంతో జాబితా ఇస్తే..సగానికి పైగా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీ ఫారం ఇస్తే, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బరి లో నుండి ఉపసంహరించుకున్నారు.
👉 నేను. చేసిన తప్పు ఏందీ.? పాపం ఏమిటి..?
తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుసార్లు పార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కేసీఆర్ పై రెండు సార్లు పోటీ చేసిన.
👉 నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్
పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్న..
👉 గాంధీ భవన్ లో మున్సిపల్ ఎనికలపై చర్చించే అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడం పై నేను ప్రశ్నించడమే తప్పు అయితే నా పై చర్య తీసుకోండి..
👉 నా మీద కోపం కార్యకర్తల పై చూపడం ఏమిటి ?నేను ప్రతిపాదించిన జాబితా పై అభ్యంతరం ఉంటే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రకటించాలి కదా..
👉 ఫైనల్ జాబితాలో పేర్లు ప్రకటించిన వారి పేర్లు మార్చడం ఏమిటి ? పార్టీ ఆలోచన విధానాన్ని.. సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు..
👉 దేశంలో రాహుల్ గాంధీ జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అంటూ పని చేస్తుంటే.. ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి అండగా నిలవడం నా బాధ్యత అవునా కాదా…చెప్పాలి..
👉 కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారి కోసం ప్రజల్లోకి వెళ్లాల, వలస వాదులకు అనుగుణంగా ప్రచారం చేయాల..అని నిలదీశారు.
👉 దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోయడంమే తప్పా అని నిలదీశారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
👉 కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా ?
👉 నిజమైన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను ?
👉 నా అన్యాయం గురించి మాట్లాడటం లేదు.. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతున్న..
👉 2014 లో కాంగ్రెసు నుండి ఎన్నికైన యాదయ్య బీ ఆర్. ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడిగా శసన సభ లో చర్చ లేవనెత్తడంతోపాటు.. గవర్నర్ ఫిర్యాదు కూడా చేసినం అని గుర్తు చేశారు.
👉 రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా ఉండటం తప్పా పార్టీ ఫిరాయింపులతో పార్టీ బలోపేతం అవుతాదా ? అని సమాధానం ఇచ్చారు.
👉 ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఇచ్చిన అఫిడవిట్లో తాను బీ ఆర్ ఎస్ పార్టీ మారలేదు..అని పేర్కొన్నారు.జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలుస్తాను.
👉 కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా..అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
