దళిత విద్యార్థులకు అత్యున్నత విద్యా అందించడమే లక్ష్యం!

👉 ఎస్సీ విద్యార్థులకు అత్యుత్తమ సివిల్స్ & గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత.


👉 ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ హైదరాబాద్ లోనే..


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

J SURENDER KUMAR,

ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాను అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు.

బుధవారం 59 దళిత కులాల సంఘాల నాయకులు లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ ను మరియు కాచిగూడలోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …

హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌ ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

👉 కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్దంచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సివిల్స్ కోచింగ్ కోరకు తెలంగాణ విద్యార్ధులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందని మంత్రి తెలిపారు.

👉 దళిత విద్యార్ధులు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడం ఖర్చుతో కూడిన పని కావడంతో ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

👉 రానున్న రోజుల్లో  విద్యార్ధుల కోసం  కొత్త టెక్నాలజీతో  డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చర్స్ తీసుకోవడంతో పాటు మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు.

👉 కోచింగ్ తీసుకునే అభ్యర్ధుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

👉 గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు.  సివిల్స్ గ్రూఫ్–1 గ్రూఫ్–2  కోచింగ్ కోరకు మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండ  తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని మంత్రి తెలిపారు.

👉 ఎస్సీ యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి  ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రతినిధిత్వం  పెరిగే విధంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు.  కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు.

👉 తమిళనాడు మోడల్‌ తరహాలో అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా (పరిపాలకుడి గా ) తీర్చిద్దిదాలనే అనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.