👉 ఈ నెల 27 నుండి మార్చ్ 11. వరకు బ్రహ్మోత్సవాలు !
👉 అన్ని శాఖల అధికారులు సమన్వయంతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల కు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలు చేశారు. ఈనెల 27 నుండి వచ్చే నెల మార్చ్ 11.వరకు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం ధర్మపురిలోనీ టీటీడీ కళ్యాణమండపంలో జరిగిన సమన్వయ సమావేశంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు ఎస్పీ అశోక్ కుమార్ లు పాల్గొన్నారు..
ఉత్సవాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అందుకు అధికారులు అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొదటగా సంబంధిత జిల్లా స్థాయి అధికారులను బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో ఏర్పాట్ల అనుభవాలు ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల గురించి శాఖ వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఈ నెలా 27 న ప్రారంభం అయి 13 రోజుల పాటు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భధ్రాచలం మరియు ఇతర దేవాలయాల అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేశారని వీటితో పాటు ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేశారాని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
👉 ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 తాగునీరు, శుద్ధమైన ఆహారం, వైద్యసేవలు, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా తాత్కాలిక వైద్యశిబిరాలు, అంబులెన్స్ సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు.
👉 మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వారికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు.
👉 అన్నదాన కార్యక్రమాలు పారదర్శకంగా, పరిశుభ్రంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు.
👉 మున్సిపల్ సిబ్బంది నిరంతరం శుభ్రత పనులు చేపట్టాలని కోనేరు వద్ద, గోదావరి పుణ్య స్నానాల వద్ద ప్రధాన ఆలయం వద్ద శానిటేషన్ చేయాలని ఆదేశించారు.

👉 గోదావరి నదిలో బ్రహ్మ, సత్యవతి గుండాలు ఉన్నందున భక్తులు పుణ్యస్నానాలు చేసేటప్పుడు లోతు ప్రదేశాలకు వెళ్ళకూడదని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అలాగే 45 మంది గజ ఈతగాళ్ళకు రేడియం తో గల టి – షర్ట్స్ అందుబాటులో ఉంచుతూ 3 షిఫ్ట్ లలో పహారా కాయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
👉 మిషన్ భగీరథ సిబ్బంది త్రాగు నీరు అవసరం మేరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా 24 గంటలు ఉండే విధంగా చూడాలని, రాత్రి వేళల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ముందస్తుగా ముందస్తుగా పెద్ద జనరేటర్లు ప్రధాన ఆలయం వద్ద మరియు డోలోత్సవం వద్ద ఏర్పాట్లు చేయాలని అన్నారు.
👉 భద్రతా పరంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆర్టీసీ అధికారులు జగిత్యాల జిల్లా డిపోలతో పాటు ఇతర డిపోలతో సమన్వయం చేసుకుంటూ అదనపు 15 బస్సు సర్వీసులు 24 గంటలు నడిపి భక్తుల రాకపోకలకు సౌలభ్యం కల్పించాలని కోరారు.

👉 ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు, ప్రముఖులు మరియు వక్తకులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు లక్ష మందికి నిత్యన్నదానం, త్రాగునీరు ఏర్పాట్లకు, ఇతర ఏర్పాట్లకు భక్తులకు సేవలందించాలని కోరారు.
👉 శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా, ఆదర్శవంతంగా నిర్వహించాలని తెలిపారు.
👉 ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో అన్ని శాఖల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటూ ఎటువంటి లోపాలు లేకుండా, ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..
ధర్మపురిలో జరిగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక వేడుకలని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హా ఈ సంవత్సరం10% నుండి 20% భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చలువ పందిర్లు, టెంట్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, అన్నదానాల వద్ద క్యూ లైన్ ల ఏర్పాటు, భక్తులుకు అర్థం అయ్యే విధంగా సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. VIP ల దర్శనానికి ప్రత్యక క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజులు LIVE వచ్చేలా LED స్క్రీన్ లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పోలీస్ శాఖకు సూచించారు. పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి, సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు జగిత్యాల జిల్లా డిపోలతో పాటు ఇతర డిపోలతో సమన్వయం చేసుకుంటూ అదనపు 15 బస్సు సర్వీసులు 24 గంటలు నడిపి భక్తుల రాకపోకలకు సౌలభ్యం కల్పించాలని కోరారు.
120 మంది స్పెషల్ మున్సిపల్ సిబ్బంది, 20 చలివేంద్రాలు, 4 ట్యాంక్ ల తాగునీరు, 2 మొబైల్ మరుగుదొడ్లు, చెత్తకుండీలు, స్నాన ఘాట్లు, విశ్రాంతి మండపాలు వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూడాలని, ప్రధాన ఆలయం, కోనేరు, గోదావరి నది తీర ప్రాంతాల్లో మరియు డ్రైనేజి ల వద్ద 2+2 ట్రాక్టర్లతో శానిటేషన్ చేయాలని, మున్సిపల్ మరియు సంబంధిత శాఖలకు ఆదేశించారు. పారిశుధ్యంపై ఎలాంటి రాజీ పడకూడదని, ప్రతి రోజు పరిశుభ్రత పనులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని తెలిపారు.
వైద్యశాఖ అధికారులు తాత్కాలిక 5 వైద్య శిబిరాలు 3 షిఫ్ట్లలో ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు 24 గంటలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 108 అంబులెన్స్ సదుపాయాలు 24 గంటలు నిరంతరం అందుబాటులో ఉండాలని, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని, ప్రధాన ప్రదేశాల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు తక్షణ స్పందన ఇవ్వాలని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, క్యూలైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని చెప్పారు.

సీసీ కెమెరాల ద్వారా భద్రతా పర్యవేక్షణ పెంచాలని, భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రం మరియు అనౌన్స్మెంట్ సెంటర్ ల ఏర్పాటు చేయాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని భక్తులకు సహకారం అందించాలని కోరారు. అగ్నిమాపక శాఖ వారు 1 అగ్నిమాపక వాహనం, ఇతర అత్యవసర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆర్&బి శాఖ వారు 3 రథాల ఫిట్నెస్ పరీక్ష చేయాలని తెలిపారు.
ప్రతి శాఖ తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించగలమని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతలే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున చేపట్టిన పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అవసరం ఉన్న మరియు చేపట్టాల్సిన పనులు రేపటిలోగా గుర్తించి అంచనాలు రూపొందించుకొని మంజూరు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు
👉 ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…
ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఆలయాల్లో, గోదావరి తీరం వెంట, బస్టాండ్ వద్ద, జాతర మైదానం వద్ద 350 మంది పోలీసులను నియమించి 24 గంటల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతర జరుగుతున్న రోజుల్లో VIP రూట్స్, ప్రధాన ఆలయం, గోదావరి నది దారులు, యాత్రికుల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరించుట, ప్రత్యేక మహిళా పోలీసు విభాగం (షీ టీమ్స్ ), పట్టణ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, పెట్రోలింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
క్విక్ రెస్పాన్స్ టీమ్, డిజాస్టర్ టీమ్, ఫైర్ మరియు ఫిషరింగ్ వారితో పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుని ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుస్తూ ప్రణాళికలు రచించి ఘనంగా జాతర నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
అలాగే ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం వల్ల రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు అనుభవాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అందుకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల సూచనలతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని చేయాలని తెలిపారు.
అనంతరం సంక్షేమ శాఖ మంత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికను మరియు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా అధికారులు, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వి. నాగలక్ష్మి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చైర్మన్ జె. రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సి.ఎచ్ లావణ్య, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, దేవస్థానం కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
