👉 యాదగిరిగుట్టను అభివృద్ధి చేసి ధర్మపురిని పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం !
👉 మున్సిపాలిటి ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అధిక నిధులు !
👉 శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మి నర్సింహాస్వామి ఆలయ అభివృద్దికి ₹ 500కోట్లు ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పరని రాష్ర్ట ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మున్సిపాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి పట్టణంలోని 1వ వార్డు, 9వ వార్డులలో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
👉 ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ .….

ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ ధర్మపురి ఆలయ అభివృద్ధికి ₹ 500కోట్లు విధుల చేస్తానని మాట తప్పరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ది చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్మపురి ఆలయాన్ని మాత్రం మరిచిపోయారని మంత్రి పేర్కొన్నారు.

👉 ప్రజల ఆశీస్సులతో గెలిచిన తాను గడిచిన రెండేళ్లు ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమానికి పథకాలను ఆమలు చేస్తున్నట్లు తెలిపారు.
👉 వచ్చే మున్సిపాల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో మున్సిపాల్ అభ్యర్ధులను గెలిపిస్తే గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ధర్మపురి పట్టణాభివృద్దికి కృషి చేస్తానని మంత్రి ప్రజలకు హమీ ఇచ్చారు.
👉 ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే నాలుగు గ్యారంటిలు అమలు చేస్తున్నామని రానున్న రోజుల్లో మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి అన్నారు.

👉 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ర్టా ఖజానా ఖాళీ కావడంతో రెండు గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్యంలో మిగిలిన రెండు గ్యారంటిలను సైతం అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ధర్మపురి పట్టణంలో గడిచిన రెండు ఏళ్లగా అనే అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చూట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. పట్టణంలో 695 మంది కొత్తగా రేషన్ కార్డులు మంజూరి ఇవ్వడం జరిగింది. పట్టణంలోని 154 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేయడం జరిగిదని ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లకు ₹7 కోట్ల 70 లక్షలు చెల్లించామని మంత్రి తెలిపారు.
👉 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 327 మందికి ₹ 93 కోట్ల 75వేలు అందజేశామని కళ్యాణ లక్ష్మి పథకం ద్వార 206 పేదలకు ₹ 2 కోట్ల 6 లక్షల 23వేలు అందజేశామని మంత్రి వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వార 2,783 మంది లబ్దిదారులకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేస్తున్నమని తెలిపారు. పట్టణంలో 542మంది రైతులకు ₹4 కోట్ల 2లక్షల 58 వేల రుణ మాఫీ చేశామని అన్నారు.
👉 15 కుల సంఘాలకు ₹ 1 కోటి 85 లక్షలతో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అలాగే టీఎఫ్ఐడీసీ మరియు రూరల్ డెవలఫ్మెంట్, స్పెషల్ డెవలఫ్మెంట్ ఫండ్ మరియు సీఎస్ఆర్ నిధులతో పట్టణ ప్రజలకు మౌళిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను పెద్ద మోజార్టీతో గెలిచించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.
