ధర్మపురిలో శ్రీమద్భాగవత సప్తహం ప్రారంభం !

👉 ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ చే ..
.

J SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ చే శ్రీమద్భాగవత కథా మహాయజ్ఞం గురువారం రాత్రి  బ్రాహ్మణ సంఘ భవనంలో ఘనంగా ప్రారంభమైంది. వేద పండితులు, మహిళలు, మంగళ హారతులు మంగళ వాయిద్యాలు  వేదమంత్రాలు పటిస్తూ శ్రీమద్భాగవత గ్రంథంతో షణ్ముఖ శర్మను వేద పండితులు ఊరేగించారు. సంఘనపట్ల దిలీప్ శర్మ పూర్ణకుంభంతో వ్యాసపీఠం వద్ద  ఘనంగా స్వాగతించారు.

👉 ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి సామవేదం షణ్ముఖశర్మ…..

శ్రీమద్భాగవతంలోని భక్తి, జ్ఞాన వైరాగ్యాల తత్వాన్ని సరళ భాషలో, ఉదాహరణలతో వివరించారు. ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి,  సలహాలు, సూచనల మేరకు  ప్రవచన వేదిక ప్రాంగణ ఏర్పాట్లను చేపట్టారు. స్వర్గీయ శివరామ శర్మ , సోదరుడు వేద పండితులు చంద్రమౌళి శర్మ, తనయుడు, చంద్రశేఖర్ శర్మ  దంపతుల ఆధ్వర్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం, గురుపూజ కార్యక్రమంతో మొదలైంది.

ఈకార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వేద పాఠశాల దాదాపు వందమంది విద్యార్థులు ధర్మపురి  క్షేత్రానికి తరలివచ్చారు. స్వర్గీయ శివరాంశర్మ కుటుంబ సభ్యులు నిర్వహణ, ఏర్పాట్లు ,ఆర్థికపర అంశాలు వారే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.

👉 నేడు లింగార్చన…

శ్రీమద్ మహా భాగవత సప్తాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ సంఘ భవనంలో లింగార్చన  కార్యక్రమం కొనసాగనన్నది.

👉 షణ్ముఖ శర్మ ప్రవచనంలో….

భగవంతుడి అవతారాలు, విరాట్ పురుషుడు, శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పారు. ప్రస్తుతం మనుషుల్లో మానసిక ప్రశాంతత లేకపోవడానికి భగవ ద్భక్తి లేకపోవడమే కారణమని శ్రీమద్భాగవత కథలను వినడం ద్వారా భక్తి భావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.