ధర్మపురి మున్సిపల్ ఏకగ్రీవం !

👉 చైర్మన్ గా వేముల నాగ లక్ష్మి రాజేష్, వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్య ఏకగ్రీవ ఎన్నిక !

👉 ప్రమాణస్వీకారం చేయించిన ఆర్టీవో మధుసూదన్ గౌడ్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్  ఎన్నికకు సోమవారం బల నిరూపణ జరగగా మున్సిపల్ చైర్మన్ గా వేముల నాగలక్ష్మి రాజేష్, వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్య  కౌన్సిలర్ ల మద్దతు తో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో  చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.

👉 మున్సిపల్ ఎన్నికలలో 15 కౌన్సిలర్ స్థానాలకు 15 స్థానాలను క్లీన్ స్వీప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన  విషయం తెలిసిందే.

మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !

👉 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కౌన్సిలర్లకు విప్ ను జారీ చేశారని, విప్ ను  ధిక్కరిస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని ఆర్డీవో సభ్యులందరికి ముందస్తుగా తెలిపారు.  చైర్మన్ అభ్యర్థిగా  వేముల నాగలక్ష్మి రాజేష్ ను,  ఓజ్జల లక్ష్మణ్ ప్రతిపాదించగా, అయ్యెరి వేణుగోపాల్ బలపరిచారు.

👉 వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్యను, కొమురెల్లి పవన్ ప్రతిపాదించగా,  విజయ్ బాబు బలపరిచారు .ఈ క్రమంలో కౌన్సిలర్ లు ఏకగ్రీవంగా మద్దతు తెలుపగా చైర్మన్ గా వేముల నాగలక్ష్మి రాజేష్,   వైస్ చైర్మన్ గా ఇందారపు రామయ్య  ఎన్నికైనట్లు ప్రకటించారు ఆర్డిఓ మధుసూదన్ గౌడ్ ప్రకటించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాక రామయ్య !

👉 ఈ ఎన్నిక మున్సిపల్ కార్యాలయంలో జరుగగా మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్, కౌన్సిలర్ లు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.