ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తున్నది !

👉 ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటింటా ప్రచారం!

J SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ గాలి జోరుగా వీస్తున్నదని మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల  ప్రచారంలో భాగంగా శనివారం పట్టణ కేంద్రంలోని 2వ, 3వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు సంగనబట్ల సంతోషి దినేష్, ఇందారం రామన్న లకు మద్దతుగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఇంటింటా  ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా మంత్రి వార్డుల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు.

ఈనెల 11న జరగనున్న  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను కోరారు.