ధర్మపురి ఓటర్లకు కృతజ్ఞతలు !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం విశ్వాసంతో ప్రజా పాలన ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించిన ధర్మపురి పట్టణ ఓటర్లకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

మీరు నాపై, ప్రభుత్వంపై  నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు అదే తరహాలో మా కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని, నేను ఎల్లవేళలా  మీ సోదరుడిలా అందుబాటులో  ఉండి సేవలందిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.