ధర్మపురిలో ముగిసిన శ్రీమద్భాగవత సప్తహం !

👉 ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనంతో ఓలలాడిన ధర్మపురి క్షేత్రం !


👉 నిత్యం వేలాది మందికి అన్న ప్రసాద వితరణ !

.J SURENDER KUMAR,

గత వారం రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా, నిత్యం వేలాది మంది భక్తజనంకు నయనానందం,  శ్రవణానందం కలిగించిన ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ చేసిన శ్రీమద్భాగవత కథా మహాయజ్ఞం ప్రవచనం బుధవారం జరిగిన వ్యాస పూజ ( గురు పూజ ) కార్యక్రమంతో  వైభవంగా  ముగిసింది.

ఈనెల 5న  బ్రాహ్మణ సంఘ భవనంలో శ్రీమద్భాగవత సప్తహం ఆరంభమైంది.  సాయంత్రం వేములవాడ ఆలయ వేద పండితులతో మహా లింగార్చన, మద్రాస్ భజన బృందం వారిచే భజన కార్యక్రమం,  స్థానిక గాయకులు కళాకారులతో సంగీత విభవరి గయోపాఖ్యానం నాటక ప్రదర్శన తో క్షేత్రం ఓల లాడింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్, గర్రెపల్లి మహేష్ శర్మ  కాశి క్షేత్ర ప్రధాన అర్చకులు,. సప్తహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తజనం షణ్ముఖ శర్మ ప్రవచనం వినడానికి తరలివచ్చారు.

మచిలీపట్నం కు చెందిన భక్తజనం ధర్మపురి వాసుల చేపట్టిన ఏర్పాట్లను వారు ప్రశంసిస్తూ  సప్తహ ప్రాంగణంలో ఫ్లెక్సీ పెట్టించారు.

👉 వేద పారాయణం !

భాగవత సప్తహ కార్యక్రమంలో భాగంగా కార్య
తెలుగు రాష్ట్రాలకు చెందిన వేద పాఠశాల దాదాపు వంద మంది విద్యార్థులు నిత్యం క్షేత్రంలో వేద పారాయణం చేశారు..

👉  నిత్యం వేలాదిమందికి అన్న ప్రసాద వితరణ !

భాగవత సప్తాహ కార్యక్రమం పగలు 12 గంటలకు  బ్రహ్మ సంఘ భవన ప్రాంగణంలో నిత్యం వేలాదిమందికి అన్నదాన ప్రసాద వితరణ, జరిగింది. సాయంత్రం సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం భక్తజనంకు ఫలహారాన్ని అందించారు. దంపతి పూజలు చీర దోతుల కానుకలు, వేద పండితులకు సంభవనలను అందించారు.

👉 కసజ్జుల వారి ఆధ్వర్యంలో…

దేవాదాయ శాఖ రిటైర్డ్ ఆర్ జె సి స్వర్గీయ కసజ్జుల శివరామ శర్మ , తనయులు, సోదరుడు  చంద్రమౌళి శర్మ, తనయులు, చంద్రశేఖర్ శర్మ , రాము శర్మల  ఆధ్వర్యంలో ఆర్థికపర అంశాలు , కార్యక్రమాలను వారే వ్యక్తిగతంగా నిర్వహించారు.

వారం రోజులపాటు జరిగిన భాగవత సప్తహ కార్యక్రమం, ఓ రాజసూయ ,అశ్వమేధ యాగం తరహాలో జరిగిందని భక్తజనం ప్రశంసలతో కొనియాడుతున్నారు