👉 దాడి అంశం వెలుగు చూడకుండా ఉన్నతాధికారుల విశ్వ యత్నం !
J.SURENDER KUMAR
ధర్మపురి అటవీ శాఖ రేంజ్ పరిధిలో సెక్షన్ లో తుంగూర్ అటవీ శాఖ అధికారిపై గురువారం అర్ధరాత్రి ( శుక్రవారం తెల్లవారుజామున) కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు గురువారం రాత్రి అధికారితోపాటు బీర్పూర్ బీట్ అధికారి బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది దాడికి గురి అయిన అధికారిని తుంగూర్ అటవీ శాఖ క్యాంపు కార్యాలయం వద్ద దింపారు..
అక్కడికి కొందరు వ్యక్తులు రావడంతో దాడి కి గురి అయిన అధికారి వాళ్లను గౌరవిస్తూ, కూర్చోండి అంటూ కుర్చీలు వేసినట్టు సమాచారం. తాగునీరు కోసం లోనికి వెళ్లి వారి వద్దకు నీటి బాటిల్ తేగానే అధికారిపై పిడి గుద్దులతో దారుణంగా కొట్టినట్టు సమాచారం..
ఎందుకు కొడుతున్నారు ? నేనేం తప్పు చేశాను ? అంటూ అధికారి చేతులు జోడించి రోధించినట్టు తెలిసింది.
శుక్రవారం దాడి సంఘటన స్థలానికి విచారణ యంత్రాంగం చేరుకొని పరిసరాలను పరిశీలించినట్లు సమాచారం. దాడికి గురి అయిన అధికారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిపోయాడా ? ప్రాణభయంతో తన స్వస్థలం మంచిర్యాల జిల్లాకు పోయాడా ? అనే విషయం తెలియాల్సి ఉంది..
దాడి సంఘటన వెలుగు చూడకుండా అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.. ఈ ప్రాంతం అటవీ శాఖ కొందరిలో నెలకొన్న అంతర్గత విభేదాలతో దాడి జరిగినట్టు చర్చ. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది..
👉 ఇష్టానుసారంగా కొట్టారు – సెల్ ఫోన్ లాక్కున్నారు !
అర్ధరాత్రి కొందరు వ్యక్తులు నన్ను ఇష్టానుసారంగా కొట్టారు ముందుగా సెల్ ఫోను లాక్కొని మరీ కొట్టారు నా చెవులలో నుంచి రక్తం కారింది స్పృహ కోల్పోయాను అంటూ దాడికి గురి అయిన అధికారి గంగారం స్పష్టం చేశారు.
అతి కష్టంపై దాడికి గురి అయిన అటవీశాఖ సెక్షన్ అధికారి గంగారాం ను “ఉప్పు ప్రతినిధి” ఫోన్ ద్వారా సంప్రదించగా దాడి జరిగింది వాస్తవం. నేను ఆసుపత్రికి వెళుతున్నాను సార్.. పోలీసులకు ,మా శాఖకు ఫిర్యాదు చేశాను అని అధికారి దాడి అంశాన్ని నిర్ధారించారు.
