ఫ్లాష్..ఆవుల ప్రాణాలు కాపాడిన విశ్వహిందూ పరిషత్ !

J.SURENDER KUMAR,

అక్రమంగా వదశాలకు తరలిస్తున్న16 ఆవుల  ప్రాణాలను ఆదివారం అర్ధరాత్రి విశ్వహిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు కాపాడారు. వాహనం లో తరలిస్తున్న ఆవులను  సాహసంగా అడ్డుకొని ధర్మపురి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే…

కౌటాల మండలం నుండి జగిత్యాల జిల్లా  చిల్వకోడూరు  పరిసర గ్రామాలకు తరలిస్తున్న ఆవుల గూర్చి ముందస్తు సమాచారంతో రాయపట్నం గ్రామానికి చెందిన విశ్వహిందూ పరిషత్ యువకులు  రాయపట్నం జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని అడ్డుకున్నారు.

వాహన డ్రైవర్ రోడ్డుపై బారికేడ్లను ఢీకొంటు వాహనం వేగాన్ని పెంచాడు. యువకులు ద్విచక్ర వాహనలతో  వెంటాడి పట్టుకొని  ఐచర్ వాహనంతో ధర్మపురి పోలీస్ స్టేషన్ కు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు.

ఆవుల అక్రమ రవాణా సమాచారాన్ని ధర్మపురి పట్టణం కు చెందిన బిజెపి నాయకులకు ఇవ్వడంతో వారికి మద్దతుగా వీరు సంఘటన స్థలానికి పరుగు పెట్టారు.

కొల శ్రీకాంత్, కసరపు వెంకటేష్, మొక్కెర అజన్న,
పోతురాల వెంకటేష్, బొక్కు వెంకటేష్,, కొసరశ్రీకాంత్, అనుగుల వెంకటేష్, మరపెల్లి ప్రశాంత్, అరేపెళ్లి ప్రశాంత్, గంగరాజు,
పోతరాజుల తిరుపతి, కస్తూరి రాజన్న, గాజు భాస్కర్, నలుమాసు. వైకుంఠం, కుమ్మరి తిరుపతి.
మండలాజి సూరజ్. వెలగందుల బుచ్చన్న, తదితరులు ఆవుల ను కాపాడడంలో కీలకపాత్ర వహించారు.

👉 మరో మూడు వాహనాలు పట్టివేత ?

ఇది ఇలా ఉండగా మంచిర్యాల జిల్లా ఇటిక్యాల  జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న మరో మూడు ఐచర్ వ్యవహారాలను పట్టుకున్నట్టు సమాచారం. కౌటాల మండలం నుండి ఐదు వాహనాలలో ఆవులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్నట్టు సమాచారం. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.