ఫ్లాష్..జూబ్లీహిల్స్ ఫలితాలే రావాలి !

👉 మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి  జూమ్ సమావేశంలో !

J.SURENDER KUMAR,

మున్సిపల్ ఎన్నికల లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో మనం సాధించిన ఫలితాలే పునరావృతం కావాలి, మనం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హస్తగతం చేసుకోవాలని జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను అప్రమత్తం చేశారు.

సోమవారం తెల్లవారు జామున సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంలో మాట్లాడారు.

ప్రతి మున్సిపాలిటీ లో  పార్టీ పార్టీ శ్రేణులు, అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ పర్సంటేజ్ ని పెంచాలని. ప్రత్యేకంగా పోల్ మేనేజ్మెంట్ కీలకమని సీఎం వివరించారు.

పోలింగ్ బూతుల వారీగా క్యాడర్ కు బాధ్యతల అప్పగించి ఓటర్ ను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు రప్పించి ఓటు వేయించే బాధ్యత వారికి అప్పగించాలని వివరించారు.

 రెండు రోజులు కీలకమని  ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీల తోపాటు ఆయా మున్సిపాలిటీలలో కౌన్సిలర్ స్థానాలను పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సీఎం మంత్రులకు సూచనలు చేశారు దాదాపు 45 నిమిషాల పాటు జూమ్ సమావేశం జరిగింది.