గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా!

👉 ప్రహరీ గోడ నిర్మాణం, బోరు బావి కి నిధులు కేటాయింపు !

J.SURENDER KUMAR,

బోయ సమాజం ( బెస్తవారు) భక్తిశ్రద్ధలతో, గోదావరి నది తీరంలో నిర్మించుకున్న గంగమ్మ ఆలయం మీరు కోరుకున్న విధంగా అభివృద్ధికి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా నిధులు కేటాయిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బోయ సంఘ కుల పెద్దలకు హామీ ఇచ్చారు.

ధర్మపురి పట్టణంలో గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు, వేద పండితులు మంత్రి ఘనంగా ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం బహుకరించారు. నూతన ఆలయం వద్ద బోరు బావి తవ్వించడంతో పాటు ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు మంత్రి ని కోరారు.