👉 గోదావరి పుష్కరాల ఏర్పాట్ల ప్రణాళిక పై ప్రాథమికంగా సమీక్షించిన జిల్లా కలెక్టర్ !
J.SURENDER KUMAR,
సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో గల మిని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో 2027 జూలై లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, దేవదాయ శాఖ, విద్యుత్ శాఖ, మరియు సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈసందర్బంగా వివిధ శాఖల వారిగా అధికారులను పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ఎలాంటి ముందస్తు చర్యలు మరియు ప్రణాళికల తయారు చేసిన అంశాల గుర్తు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
👉 ఈ సందర్బంగా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…
జిల్లాలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ముఖ్యంగా ధర్మపురి, మరియు కోటిలింగాల ఆలయాలకు ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
👉 ఇదివరకు సమర్పించిన నివేదికలను మండలం స్థాయిలో మరొకసారి సమీక్షించి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు.
👉 పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

👉 2027లో జులై నెలలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వతమైన అన్ని రకాల మౌలిక వసతులు, ఆలయాల అభివృద్ధి మరియు చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
👉 జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను మరియు నూతనంగా అవసరం ఉన్న చోట్ల పుష్కర ఘట్లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు సూచించారు.
👉 పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షలకు పైన భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు.
👉 సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో జిల్లాలోని గోదావరి పుష్కరాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక అందించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్ , ఆర్డీవో, డిఎస్పీ ( ఎస్బి ) , జిల్లా సంబంధిత శాఖల ఎస్ ఈ, ఈఈ, డిఈ లు, కలెక్టరేట్ ఏవో, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్, ధర్మపురి ఆలయ ఈ వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
