J SURENDER KUMAR,
విజయవాడ నగరంలో మార్చి రెండవ వారంలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లీనరీ సమావేశాలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టు నాయకులను సాదరంగా ఆహ్వానించి సమావేశాలకు రానున్నట్టు హామీ ఇచ్చారు. ఐజేయు సెక్రెటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న డి సోమ సుందర్, డబ్ల్యూ డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు , తదితర జర్నలిస్టులు సీఎం బాబు కలిసిన వారిలో ఉన్నారు.

