ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటేనే దాడి చేశారా ?

👉 ప్రేక్షక పాత్రలో అటవీ పోలీస్ యంత్రాంగం !

👉 ఇసుక అక్రమ రవాణా తో కవ్వాల టైగర్ జోన్ కు పొంచి ఉన్న ముప్పు !

J.SURENDER KUMAR ,

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్  అటవీశాఖ సెక్షన్ అధికారి గంగారం, ఇసుక అక్రమ రవాణా వాహనాలు అడ్డుకుంటే నే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారా ? అనే చర్చ గుట్ట కింద గ్రామాల్లో మొదలైంది..

గురువారం (19 న) అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుంగూర్ అటవీశాఖ అధికారి గంగారాం ను దారుణంగా కొట్టిన విషయం విధితమే.


అధికారిపై దాడి జరిగి గత నాలుగు రోజులు కావస్తున్నా  సంబంధిత అటవీశాఖ ఉన్నతాధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప సుమోటోగా సోమవారం నాటికి కేసులు నమోదు చేయలేదు.
తన సహచర ఉద్యోగిపై జరిగిన దాడిని నిరసిస్తూ అటవీ శాఖ ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ బాధిత అధికారికి ఎలాంటి నైతిక మద్దతు ప్రకటించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

👉 నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా !

గోదావరి నది తీర గ్రామాలు చిన్న కొలువాయి, రేకులపల్లి,  ఆరేపల్లి , మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి తదితర నది తీరాల నుండి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి నిల్వ ఉంచుతారు. జెసిబి యంత్రాల ద్వారా టిప్పర్లు నింపుకొని  పట్టణాలకు తరలిస్తున్నారు.

👉 కవ్వాల టైగర్ జోన్ కు పొంచి ఉన్న ముప్పు !

గోదావరి నదిలో ఇసుక తరలింపుతో నది లో నీటి నిలువలు తగ్గడంతో పాటు కవ్వాల  టైగర్ జోన్ లో పులులకు, ఇతర వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని. నది తీర ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిందేగా  సంబంధిత అటవీ శాఖ  ఉన్నతాధికారి కాలేశ్వరం జోన్ పరిధిలోని జిల్లాలలో అటవీశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

👉 కాలేశ్వరం జోన్ FDPT  ఆదేశాలు !

నిర్దిష్ట టైగర్ రిజర్వ్ లోపల ప్రణాళిక, నిర్వహణ మరియు రక్షణ కార్యకలాపాల పర్యవేక్షణకు ఐఎఫ్ఎస్ అధికారి బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం శాంతారామ్ అధికారి కాలేశ్వరం జోన్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ ,(FDPT) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

👉 చెవి లో కరణ బేరికి గాయం !

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన అధికారి గంగారం చెవిలోని కరణబేరీకి తీవ్ర గాయాలైనట్టు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఔట్ పేషెంట్ గా నమోదు చేసుకుని వైద్యం అందించారు. అవుట్ పేషెంట్   స్లిప్పుపై MLC ( మెడికో లీగల్ కేస్) అని వైద్యుడు స్పష్టంగా రాశాడు.

👉 ఇసుక ట్రాక్టర్ పట్టివేత !

తనపై దాడి జరిగిన  ఉదయం శుక్రవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను గంగారం పట్టుకుని రేంజ్ కార్యాలయానికి అప్పగించారు. గిరిజన వర్గానికి చెందిన అధికారి గంగారం, ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. అధికార. యంత్రాంగం జోక్యం చేసుకొని గంగారం కు న్యాయం న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది.