👉 మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
జిల్లా కేంద్రమైన జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, చైతన్యానికి త్యాగానికి ప్రతిరూపమైన జగిత్యాల గడ్డ కాంగ్రెస్ అడ్డా అని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రాత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన అర్ధరాత్రి వరకు విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.

మంచినీళ్ల బావి, బీట్ బజార్, బస్ డిపో, మార్కండేయ గుడి కమాన్, ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల పరిసర వార్డులకు చెందిన అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రి ఓటర్లను అభ్యర్థించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంట ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య , జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్,గిరి నాగభూషణం, గట్టు సతీష్, మన్సూర్, అల్లాల రమేష్ రావు, పట్టణ ఆయా వార్డుల నాయకులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.
