కలిసి కట్టుగా పని చేయండి ఫలితాలు సాధించండి !

👉సీఎం రేవంత్ రెడ్డి బృందానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన!

👉 సెంట్రల్ అట్రాక్షన్ గా మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రితో పాటు రాష్ర్ట మంత్రులు సమన్వయంతో కలిసి పని చేస్తున్న  ఎన్నికల్లో చక్కటి ఫలితాలు సాధించాలని, పంచాయితీ, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాధించాలని ఏఐసీసీ అధ్యక్షులు  మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ర్ట మంత్రులకు సూచించారు.  గురువారం ఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రుల ముఖ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, AICC జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  మహేశ్ కుమార్ గౌడ్  పాటు
క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు.

👉 సెంట్రల్ అట్రాక్షన్ గా మంత్రి లక్ష్మణ్ కుమార్ !

ఈ సందర్భంగా రాష్ర్టంలో ఇటీవల నిర్వహించిన  గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాల్ ఎన్నికల ఫలితాలపై చర్చించి మోజార్టీ స్థానాలు సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అగ్ర నేతలు ప్రత్యేకంగా అభినందించారు.  ఈ సమావేశంలో  పలువురు మంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను అభినందిస్తూ  భుజం తట్టడంతో మంత్రి సెంట్రల్ అట్రాక్షన్ అయ్యారు.

పంచాయతీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం లో 149 పంచాయతీలను గాను 108 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించడంతో పాటు,  మున్సిపాలిటి ఎన్నికల్లో ధర్మపురి మున్సిపాలిటిలో 15 స్థానాలకు గాను 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అభ్యర్ధులు విజయం సాధించినందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖార్గే తో పాటు రాహుల్ గాంధీ , కేసీ వేణుగోపాల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా అభినందించారు.

స్థానిక సంస్ధల ఎన్నికలు అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ సత్త చాటాలని  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. రాష్ర్టంలో ఏఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్ పార్టీది కావాలని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పేర్కొన్నారు.
మంత్రులు  సమన్వయంతో పని చేస్తు ముందుకు సాగాలని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుతేని విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ  రెండేళ్ల పరిపాలనకు నిదర్శనమని కాంగ్రెస్ అగ్రనేతలు పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 100శాతం సీట్ల సాధించి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ తిరుగుతేని శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వీరికి సూచించారు.