కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గ్రామీణ ప్రాంతాల్లోని  క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేది నుంచి ధర్మపురి పట్టణంలోని అమ్మ గార్డెన్స్ లో జరుగనున్న రాష్ట్రస్థాయి కుంగ్-పూ & కరాటే పోటీల పోస్టర్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఒలంపిక్ లో బంగారు పతాకాలు సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలో రాష్ట్రస్థాయి క్రీడలు జరుగనుండడం అభినందనీయమన్నారు.

టోర్నమెంట్ నిర్వాహకుడు కస్తూరి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 700 మందికి పైగా క్రీడకారులు టోర్నమెంట్ లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ భాదినేని రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.