👉 రాజ్యాంగం గురించి కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే !
👉మెట్ పల్లి సమస్యల పరిష్కారం నా బాధ్యత !
👉 ఎన్నికల తర్వాత కుర్చీ వేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తా !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరోజైనా పూలమాల వేశాడా ? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం మెట్ పల్లిలో సమస్యలన్నీ కుర్చీ వేసుకొని పరిష్కరిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు హామీ ఇచ్చారు.
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం అయ్యప్ప స్వామి దేవాలయం, చావటి వద్ద కార్నర్ సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

భారత రాజ్యాంగం గురించి డాక్టర్ సంజయ్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బెదిరింపులకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని మంత్రి అన్నారు.

కెసిఆర్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ రాజ్యాంగం గురించి మాట్లాడడం ఏమిటని ? ప్రశ్నించారు.మెట్ పల్లి లోని ఎస్సారెస్పీ భూముల్లో ఇళ్ళు నిర్మాణం చేసుకున్న వారికి పట్టాలు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పట్టణంలో అవసరమైన కొత్త రేషన్ దుకాణాలను మంజూరు చేయిస్తానని మంత్రి ఓటర్లకు హామీ ఇచ్చారు. మెట్ పల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తేనే మెట్ పల్లి పట్టణం సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
