కొండగట్టు హుండీ ఆదాయం కోటి రూపాయలకు పైనే !

👉 కేవలం 43 రోజుల కే……

J SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయం ₹ 1,16,04,438/- ( కోటి 16 లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పది ఎనిమిది రూపాయలు) వచ్చాయి అని  కార్యనిర్వాహణాధికారి శ్రీకాంత్ రావు తెలిపారు.

కేవలం 43 రోజుల లో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలను సమర్పించుకున్నారు.గురువారము సిరిసిల్లకు చెందిన శ్రీ లలిత సేవా ట్రస్ట్  వారు అధికారుల నిఘా నీడలో లెక్కించారు. హుండీలు లెక్కింపు చేయగా వచ్చిన మిశ్రమ వెండి, బంగారము తిరిగి బ్యాగ్ లో వేసి సీల్ చేసి హుండీలో తిరిగి భద్రపరిచారు.
హుండీ లో 199 విదేశీ కరెన్సీ  నోట్స్ వచ్చాయి.


హుండీ లెక్కింపును  రాజమోగిలి, పరిశీలకులు దేవాదాయ శాఖ జగిత్యాల ఆలయ AEO గుండి హరిహరనాత్, డి. సునీల్ కుమార్ పర్యవేక్షకులు, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ సిబ్బంది, ఏ.ఎస్.ఐ, మహిళా కానిస్టేబుల్, హోంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది  పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది.