లాల్ సలాం కు – లాస్ట్ సలామ్ !

👉 అగ్ర నేతలు లొంగుబాటు నేడు వాస్తవం నాడు  అవాస్తవం !

J.SURENDER KUMAR,

మావోయిస్టు కీలక అగ్రనేతలు, తిప్పరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, బడే చొక్కరావు లతో పాటు మరో 40 మంది మావోయిస్టులు మంగళవారం లాల్ సలాం కు  లాస్ట్ సలామ్  చేసి తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయింది వాస్తవమే.

అయితే. గత ఐదు సంవత్సరాల క్రితం మావోయిస్టు చీఫ్  ముప్పాల లక్ష్మణరావు, అలియాస్ గణపతి, తో సహా  పలు రాష్ట్రాల మావోయిస్టు ఇంచార్జిలు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతారు అనే ప్రచారం అవాస్తవం అయినా, నేడు ఆ ప్రచారంను వాస్తవ రూపం దాల్చడానికి తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, పోలీస్ యంత్రాంగం చేసిన కృషిని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. అయితే లొంగుబాటులో సిద్ధాంతకర్త మావోయిస్టు చీఫ్ గణపతి  మాత్రం లేరు.

ప్రభుత్వానికి మంగళవారం లొంగిపోయిన తిప్పరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, బడే చొక్కా రావు


👉 నాడు గణపతి లొంగుబాటు ప్రచారం !

2019-20  దాదాపు 5 6 సంవత్సరాల క్రితం మావోయిస్టు చీఫ్ గణపతి , 2018 డిసెంబర్ లో  నంబాల కేశవ రావు , @ బసవరాజ్ కు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన  ప్రకటన లో పేర్కొంది.

ఈనేపథ్యంలో గణపతి ఆరోగ్యం క్షీణించడం, వయస్సు పెరగడం, గణపతికి ప్రాధాన్యత తగ్గింది తదితర కారణాలతో ఆయన సరెండర్ కావడానికి ఆయా రాష్ట్రాల మావోయిస్టు ఇంచార్జ్లతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచార సాధనాలలో ఊదరగొట్టారు.

👉 తెలంగాణ ప్రభుత్వంతో  చర్చలు ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత, ఎస్ఐబి చీఫ్ గణపతి సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో, చర్చలు జరిగాయని, ప్రాణభయం, ఎలాంటి కేసులు లేకుండా, గణపతి తో పాటు అగ్ర నేతలు సైతం లొంగుబాటుకు రంగం సిద్ధమైందని ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. 

రాష్ట్ర ఎస్సైబీ ఇంటెలిజెన్స్  అధికారులు గతంలో నక్సలైట్ ప్రాబల్యం గల ప్రాంతాల విధులు నిర్వహించిన సీనియర్ పాత్రికేయులను, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆక్సిలేటర్ పదోన్నతులు పొంది పదవి విరమణ చేసిన పోలీస్ అధికారులను సంప్రదించారు.

రాష్ట్రస్థాయి ఓ కీలక పోలీసు ఉన్నతాధికారి, మీడియా సంస్థల బ్యూరో చీఫ్ లతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పోలీస్ ఇన్ ఫార్మర్లతో, లొంగిన మావోయిస్టు డీసీఎం లతో మీడియా సంస్థల  యజమానులతో సైతం గణపతి లొంగుబాటు వాస్తవమైనా ?  అంటూ వివరాలు సేకరించారు. 

దాదాపు పది రోజులుగా ప్రచార సాధనాలలో  కొనసాగిన గణపతి తో పాటు కీలక అగ్రనేతల లొంగుబాటు ప్రచారం కు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది.

ఇందులో లొంగుబాటుల ప్రచారం భూటకం, కేంద్ర రాష్ట్ర ఫాసిస్టు ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, మా  మా పార్టీలో గందరగోళం సృష్టించడానికి పోలీసుల సృష్టి  అంటూ  ప్రకటనలో పేర్కొంది.

👉 గణపతి పేరున ఒకేసారి ప్రకటన వచ్చింది ?


కొయ్యూరు  ఎన్కౌంటర్ లో నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డిల అంతిమ దహన సంస్కార సందర్భంగా వీరి ఎన్కౌంటర్ జరిగిన తీరును బెంగళూరు డెన్ ( రహస్య స్థావరం) ఇంచార్జ్ గోవిందరెడ్డి, చేసిన ద్రోహంతో   వీరిని పోలీసులు కిడ్నాప్ చేసి హతమార్చారు అంటూ విడుదల చేసిన ప్రకటన పౌర హక్కుల సంఘం నాయకుడు వరవరరావు చదివి వినిపించారు.