👉 మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అధికారం అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,తనతో పాటు, అమాయక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేశారని, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 5వ, 8వ, 14వ6వ 13వ 12 వ వార్డులలో ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ….

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తి గతంగా మాట్లాడితే తాను మాట్లాడుతానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గతంలో వారి ప్రభుత్వం లో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ ఉండి ఎందుకు ప్రజల సమస్యలు పరిష్కారించలేదని మంత్రి ప్రశ్నించారు.
👉 యాదాద్రి ని అభివృద్ధి చేసిన కేసీఆర్ ను ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పై కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించ లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.


👉 అధికారంలో ఉన్న సమయంలో కొప్పుల ఈశ్వర్ ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు.
👉 రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో జరిగిందని మంత్రి అడ్లూరి తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

👉 నిరుపేదలకు నిమ్స్ వంటి ఆసుపత్రిలో వైద్యం అందించడంతో పాటు పేద ప్రజల అవసరమైన ప్రైవేట్ వైద్యం అందించడానికి చేయూత అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
👉 ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 15కు 15మంది అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
👉 ప్రజ నాయకుడు అడ్లూరి..
పీసీసీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు కోసం పని చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రజా నాయకుడు దోరకడం ధర్మపురి ప్రజల అదృష్టమని అన్నారు. ధర్మపురి సుభిక్షంగా ఉండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మోజార్టీ తో గెలిపించి ప్రజలు మనిషి లక్ష్మణ్ కుమార్ కు మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
👉 కన్నీటి పర్యంతం అభ్యర్థి కుమారుడు !
8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న జంజిరికాని సువర్ణ ,కుమారుడు భరత్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ తన తల్లిని ఓడించడానికి ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వెంట ఉన్న వారికి బెదిరింపులకు గురి చేస్తున్నారని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
👉 ఓటర్ల కు వరం ఇచ్చిన అభ్యర్ది…
5వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల నాగలక్ష్మి వార్డులో ఎవ్వరికీ ఎలాంటి సమస్య వచ్చినా ₹11,116 చేస్తానని ప్రకటించారు.
👉 జోరుగా ఇంటింటా ప్రచారం !

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ధర్మపురి పట్టణంలోని 6వ వార్డులో ముడుసుల ప్రశాంత్, 13వ వార్డులో కాశెట్టి రాజేష్,12 చుక్క సంధ్యారాణి భీంరాజ్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
