👉 నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె .జానా రెడ్డి తో రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం హైదరాబాదులో ఆయన గృహంలో మర్యాదపూర్వకంగా కలసి మంతనాలు జరిపారు.
నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వాణ తీరుతనులు బి ఫాం అంశాలపై ప్రత్యేకంగా చర్చించడానికి ధర్మపురి నుంచి హుటా హుటిన హైదరాబాద్ కు వెళ్లారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ చర్చలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, ప్రజల సమస్యలను మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జానారెడ్డితో సుదీర్ఘంగా అభిప్రాయాలు పంచుకున్నారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కీలక కేంద్రంగా ఉండటంతో, అక్కడ పార్టీకి మరింత బలమైన ప్రజాదరణ కల్పించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై జానారెడ్డి తన అనుభవాన్ని తెలిపారని మంత్రి పేర్కొన్నారు.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, యువత, మహిళలు, దళితులు, ఆదివాసీలను పార్టీతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని,
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సమర్థంగా చేరేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జానారెడ్డి సూచించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే బలంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి లాంటి అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం కాంగ్రెస్ పార్టీకి మరింత శక్తినిస్తుందని, వారి సూచనలు పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
