మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన చైర్ పర్సన్ !

J SURENDER KUMAR,

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు బుధవారం హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వారితో మాట్లాడుతూ..


జగిత్యాల పట్టణ అభివృద్ధితో పాటు, రాజకీయ పార్టీల కౌన్సిలర్లతో సమన్వయంగా కొనసాగుతూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు. సీనియర్ నాయకుల, రాజకీయ అనుభవాలు  సలహాలు సూచనలు పరిగణంలోకి తీసుకొని పట్టణాభివృద్ధికి జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కృషి చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 టి పిసిసి అధ్యక్షుడి కలిసిన చైర్ పర్సన్ !

రాష్ట్ర ప్రదేష్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్, ను  మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించాలని టిపిసిసి అధ్యక్షుడు చైర్ పర్సన్ కు సూచించారు