J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రంలో రెండవ పర్యాయము జరిగిన మున్సిపల్ ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మున్సిపల్ రికార్డులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, హాయంలో బ్రేక్ అయ్యాయి.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ ( వికారాబాద్ జిల్లా) లో 16 వార్డులు, క్లీన్ స్వీప్ అయింది.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిథ్యంలో వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు.

👉 చారిత్రక నేపథ్యం ఉన్న ధర్మపురి 1958 లో మున్సి పాలిటీ గా ఏర్పాటైంది. ధర్మపురి మొదట మున్సిపాలిటీగా ఆ తర్వాత మేజర్ పంచాయతీ తదనంతర పరిణామాలతో మున్సిపాలిటీగా అవతరించింది.
👉 చైర్మన్ , సర్పంచ్ లు నాడు ఉత్తర ప్రాంతం నేడు దక్షిణ ప్రాంతం !
1958 లో ఆవిర్భవించిన ధర్మపురి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీలో చైర్మన్లు సర్పంచ్ పదవులు 2025 మునిసిపల్ ఎన్నికల నాటికి మున్సిపల్ కార్యాలయానికి ఉత్తర ప్రాంతం వారే వరుసగా పదవులు చేపట్టారు.
సోమవారం జరిగిన చైర్పర్సన్ గా ఎన్నికైన వేముల నాగలక్ష్మి, దక్షిణ ప్రాంతం కు దక్కడంతో రికార్డ్ బ్రేక్ అయ్యింది..( 5 వ వార్డు, హనుమాన్ వాడ )
👉 1958లో మొదటి మున్సిపల్ చైర్మన్
చీపిరిశెట్టి రాజన్న ( తోట్లవాడ )

👉 1962 నుంచి కాశెట్టి గంగారం మున్సి పల్ చైర్మన్ (కాసెట్టివాడ మినహా)
👉 మేజర్ పంచాయతీగా ఏర్పాటుతో..
1964లో మున్సిపల్ హోదా నుంచి ధర్మపురి మేజర్ పంచాయతీగా అవతరించింది. సర్పంచ్ గా కాసర్ల కిష్టయ్య 1964, 1971లో రెండు పర్యా యాలు సర్పంచిగా 1980 వరకు కొనసాగారు. (శివాలయం వీధి)
👉 1981లో సర్పంచ్ గా చీరిశెట్టి రామకిష్టయ్య, పనిచేశారు (తోట్లవాడ )
👉 1988లో సర్పంచ్ గా సంగి కిష్టయ్య పనిచేశారు (తోట్లవాడ)
👉 1995లో సర్పంచ్ గా రేణికుంట రాధాకిషన్, పనిచేశారు. (తోట్ల వాడ)
👉 2001లో సర్పంచ్ గా ఒడ్నాల మల్లేశం పని చేశారు. (తోట్లవాడ)
👉 2006 లో సర్పంచ్ గా సంగి సత్యమ్మ పనిచేశారు. ( తోట్లవాడ )
👉 2011లో సర్పంచ్ గా సంగి సత్యమ్మ, పనిచేశారు ( తోట్లవాడ)
👉2013 -18 వరకు సంగి సత్తెమ్మలు సర్పంచిగా విధులు నిర్వహించారు.( తోట్లవాడ)
👉 15 వార్డులతో మున్సిపాలిటీగా నూతనంగా అవతరించిన ధర్మపురి 2020 లో జరిగిన ఎన్నికల్లో సంగి సత్యమ్మ మొదటి చైర్ పర్సన్ గా కొనసాగారు ( తోట్లవాడ )
👉 వరుసగా వైస్ ఛైర్మన్ పదవులతో ఇందారపు రామయ్య !

2020 మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా విజయం సాధించిన ఇందారపు రామయ్య వైస్ చైర్మన్ గా కొనసాగారు. 2025 మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కౌన్సిలర్ గా విజయం సాధించి మరోసారి వైస్ చైర్మన్ పదవి చేపట్టారు. ధర్మపురిమేజర్ పంచాయితీ లోను రామయ్య ఉప సర్పంచ్ గా కొనసాగారు.
👉 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా విజయం సాధించిన సంగనభట్లసంతోషిని దినేష్, వేముల నాగలక్ష్మి రాజేష్, జక్కు పద్మా రవీందర్ 2025 ఎన్నికల్లోను కాంగ్రెస్ కౌన్సిలర్లుగా పోటీ చేసి విజయం సాధించారు. మీరు మినహా మరో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తొలిసారి మున్సిపల్ లో అడుగుపెట్టానున్నారు.
