ముస్లింల కు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు !

👉 నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం !

J.SURENDER KUMAR,

ముస్లిం సమాజానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా  శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలో పేర్కొన్నారు.

నెలవంక కనిపించడంతో గురువారం నుండి రంజాన్ మాస వేడుకలు ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర, సోదరీమణులు కఠిన ఉపవాసాలతో అల్లాహ్ పై తమ భక్తిని చాటుకుంటారని రంజాన్ మాసం సామరస్యానికి, సోదరభవానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

👉నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం !

ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 గురువారం నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. అయితే రంజాన్​ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్​ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్​ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే  రాష్ట్రంలోముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే.

సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం కానున్నది, దీనికి తోడు సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది.ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.