నిలకడగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్యం !

👉 పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మాజీ మంత్రి  జీవన్ రెడ్డి స్వల్ప అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షల నిమిత్తం  చేరిన విషయం తెలుసుకొని మంత్రి లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్ కు చేరుకొని ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి తో, వైద్యులతో జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్యం  నిలకడగా ఉందని ఆందోళన  అవసరం లేదని వైద్యులు తెలిపారు.

జీవన్ రెడ్డి స్వల్ప అనారోగ్యంతో  ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకొని మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురి నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని ఆసుపత్రికి వెళ్లి మాజీ మంత్రి  జీవన్ రెడ్డిని పరామర్శించారు.