నిజామాబాదు జిల్లా వ్యవసాయం దేశానికే ఆదర్శం !

👉 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ₹ 600 కోట్ల పనులకు భూమి పూజ !

👉 ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య  సంఘాలకు  ₹ 200 కోట్ల  చెక్కు పంపిణీ !

J.SURENDER KUMAR,

నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరు. ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శం. ఈ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రజాపాలన – ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి  ప్రసంగించారు.

👉 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పాఠశాలకు ₹ 200 కోట్ల రూపాయల చొప్పున మొత్తం ₹ 600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  శంకుస్థాపనలు చేశారు.


👉 రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు) కు ₹ 200 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు
.

👉 ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు !

₹ 20 కోట్లతో  తెలంగాణ యూనివర్సిటీ, దిచ్‌పల్లిలో ఎస్సీ బాలురు, బాలికల హాస్టళ్ల నిర్మాణం.

  గిరిజన సంక్షేమ శాఖ – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులు.

₹ 8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణం.

యూనివర్సిటీలో ₹ 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం.  ₹ 43 కోట్ల అంచనా వ్యయంతో వర్సిటీ ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులు

₹ 18 కోట్లతో చేపట్టిన యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం

₹ 200 కోట్ల మేరకు స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ చెక్కుల పంపిణీ

₹ 21 కోట్ల అంచనా వ్యయంతో నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు వరకు (0/0 కి.మీ నుండి 5/8 కి.మీ), పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుండి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు (0/0 కి.మీ నుండి 8/2 కి.మీ) రోడ్డు రోడ్డు వెడల్పు పనులు.

👉 ఈ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు , ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి , మహమ్మద్ అలీ షబ్బీర్ తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.