పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన ఐటీ పార్క్!

👉 ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మున్సిపల్ లో గెలిస్తే పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుంది…

👉 మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు & పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు !

J.SURENDER KUMAR,

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని గత బి.ఆర్.ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదు. అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర  మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో కలిసి పాల్గొన్న  పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు

👉 ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ…

బి.ఆర్.ఎస్ హయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని గాడిలో పెట్టీ  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం.


👉 బి.ఆర్.ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారు అని అన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ మరియు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


👉 పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూమ్ లకు మౌలిక సదుపాయాలు కల్పించి అందించిన ఘనత మీ ఎమ్మెల్యే విజయరమణ రావు దే అని అన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు..