ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు అతిక్రమిస్తే  చర్యలు !

👉 అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ బి రాజగౌడ్ !

J SURENDER KUMAR,

ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ బి రాజగౌడ్ అన్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ , క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ -2010 యొక్క జిల్లా స్థాయి సమావేశం అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఛాంబర్ లో సోమవారం జరిగింది.

👉 ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి రాజగౌడ్  మాట్లాడుతూ…..

ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంపల్సరీ అని, రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ మాత్రమే సేవలు అందించాలని ఎవరైనా వెళ్ళిపోయిన కానీ  కొత్తగా చేరినచో డాక్టర్లను గాని స్టాప్ ను గాని ఆడ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలని, చట్టంలో పొందుపరిచిన అంశాలను అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు పాటించాలని ఆదేశించారు.

👉 జిల్లా వైద్యాధికారి డాక్టర్  సుజాత మాట్లాడుతూ…

ప్రోగ్రాం ఆఫీసర్స్ కు డివిజన్ ల వారిగా  కొన్ని హాస్పిటల్స్ కేటాయించి ఎల్లప్పుడూ వారిని తనిఖీ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి స్పెషల్ బ్రాంచ్ వెంకటరమణ,  క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పర్యవేక్షకులు కుతుబుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ తరాల శంకర్  మరియు తదితరులు పాల్గొన్నారు.