J.SURENDER KUMAR,
ప్రముఖ ప్రవచకులు, శ్రీ శ్రీ శృంగేరి పీఠ ఆస్థాన విధ్వంసులు, డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి లో మరో కోణం నటన కౌశల్యం ధర్మపురి క్షేత్ర వాసులకు అగుపించింది..
👉 వివరాల్లోకి వెళితే…
డాక్టర్ బాచంపల్లి తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ, విదేశాలలో ఆయనకు గణనీయమైన శిష్యగణం ఉంది. ఆయన ప్రవచన కార్యక్రమలు 2026 డిసెంబర్ వరకు ముందస్తుగా నిర్ణయించబడ్డాయి.

ప్రముఖ ప్రవచకులు సామవేద షణ్ముఖ శర్మ, గత వారం రోజులుగా ధర్మపురిలో శ్రీమద్భాగవత కథా మహాయజ్ఞం ప్రవచన కార్యక్రమం సంఘ భవనంలో కొనసాగింది. . ఈ నేపథ్యంలో డాక్టర్ బాచంపల్లి ధర్మపురి క్షేత్రంలోనే మకాం వేశారు..

స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి వారు భాగవత సప్తాహ కార్యక్రమంలో భాగంగా గయోపాఖ్యానం అనే నాటకం ప్రదర్శించారు. ఈ ఈ నాటకంలో బాచంపల్లి నకులుడు పాత్ర వేసి ప్రేక్షకులను అలరించారు.
