పుట్ట బంగారం పూజలో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ !

J SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,  ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రంలోని చింతామణి చెరువు గట్టు నుంచి పుట్ట బంగారం సేకరించి  బ్రహ్మోత్సవాల ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చింతామణి చెరువు గట్టుకు తీసుకువచ్చి వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పురాతన టిటిడి ధర్మశాలకు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట బంగారం సేకరణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

ధర్మపురి లో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు.

పుట్ట బంగారం సేకరణ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, దేవాలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ తో పాటు మున్సిపల్  కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శేషప్ప కళా వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించి తిలకించారు.